కోటి మందికి ఈ-శ్రమ్ కార్డులు
ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర కార్మిక శాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 20 ( విజయక్రాంతి ): 2024లో కోటి మంది కార్మికులకు ఈ కార్డులను అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది కూడా ఇదే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా.. పలు కారణాల దృష్ట్యా 50 లక్షల కార్డులను మాత్రమే అందించింది. దీంతో ఈ ఏడాదైనా లక్ష్యాన్ని సాధించేలా వెబ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 43.6 లక్షల మంది కార్మికులు చేరారు.
జిల్లాల వారీగా నమోదు చేసుకున్నవారి సంఖ్య..
జిల్లా నమోదు
చేసుకున్నవారు
హైదరాబాద్ 3,29,725
రంగారెడ్డి 2,03,348
నల్లగొండ 1,99,729
కొత్తగూడెం ,75,773
కరీంనగర్ 1,64,398
మహబూబ్‌నగర్ 1,55, 611
మేడ్చల్ 1,51,333
కామారెడ్డి 1,50,716
సంగారెడ్డి 1,49,464
హనుమకొండ 1,41,797
జగిత్యాల 1,30,299
ఆదిలాబాద్ 1,29,214
సూర్యాపేట 1,90,917
మహబూబాద్ 1,25,315
వరంగల్ 1,28,812
నిజామాబాద్ 1,21,831
సిద్దిపేట 1,10,931
పెద్దపల్లి 17,000
గద్వాల 1,08,813
నాగర్‌కర్నూల్ 97,970
భూపాలపల్లి 96,361
నిర్మల్ 94,551
యాదాద్రి 1,19,599
వికారాబాద్ 91,296
వనపర్తి 88,136
మెదక్ 86,314
నారాయణపేట 91,107
ఆసిఫాబాద్ 59,371
ములుగు 52,541
ఈ-శ్రమ్ కార్డు
దేశంలో అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం కేంద్ర కార్మికశాఖ 2021 అగస్టులో ‘ఈ పోర్టల్ ప్రారంభించింది. ఈ పథకం లో 16 ఏళ్ల వయసువారు అర్హు లు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28 కోట్ల ఈ కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఎటువంటి ప్రావిడెంట్ ఫండ్, బీమా సౌకర్యలు ఉండవు. ఇటువంటి శ్రమజీవుల భవిష్యత్తు, భద్రత, వృద్ధాప్యం లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ కార్డు ఎంతగానే ఉపయోగపడుతుంది. ఈ కార్డు తీసుకున్న కార్మి కులకు ప్రమాద బీమా కూడా వర్తిస్తుంది. పాక్షికంగా వైకల్యం వస్తే రూ.లక్ష, శాశ్వత వైకల్యం లేదా మర ణం సంభవిస్తే రూ.2 లక్షలు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ కార్డు ద్వారా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పనిముట్లు, కుట్టు మిషన్ వంటి ఇతర ఆర్థిక సాయం కూడా అందుతుంది.






