21 May, 2026 | 2:46 AM

వడదెబ్బతో మహిళారైతు మృతి

21-05-2026 01:42 AM

కోనరావుపేట, మే 20 (విజయక్రాంతి):కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బకు గురై మహిళా రైతు ఎర్ర గడ్డం లచ్చవ్వ (55) మృతి చెందారు.మృతురాలి భర్త లచ్చిరెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చవ్వ బుధవారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఇంటికి చేరుకున్న వెంటనే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

అనంతరం పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.వడదెబ్బ కారణంగానే లచ్చవ్వ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. మృతురాలికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. లచ్చవ్వ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.