నేడు ఈఏపీసెట్ ఫలితాలు
18-05-2024 02:15 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం జేఎన్టీయూహెచ్‌లో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.






