టీమిండియా కోచ్‌పై లాంగర్ ఆసక్తికర వ్యాఖ్య
ప్రపంచ క్రికెట్‌లో అదే అతిపెద్ద బాధ్యత
ముంబై: భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించడం.. ప్రపంచ క్రికెట్‌లో అతి పెద్ద బాధ్యత అని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌తో ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండటంతో.. బీసీసీఐ కోచ్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త శిక్షకుడి రేసులో గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న లాంగర్ దీనిపై స్పందిస్తూ.. ‘అది (టీమిండియాకు హెడ్ కోచ్) క్రికెట్‌లోనే అతి పెద్ద బాధ్యత. భారత జట్టు నుంచి ఎక్కు వ ఆశిస్తారు. అది చాలా పెద్ద సవాలు. దానికి తగినంత సమయం కావాలి. తీవ్రమైన ఒత్తిడి ఉంటుందనేది వాస్తవం. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌ను అడిగినా ఇదే మాట చెప్తారు’ అని అన్నాడు.






