11-05-2025 07:08:21 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆయన బాన్సువాడ నియోజకవర్గంలోని మోస్రా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, ఎలమంచిలి శ్రీనివాసరావు, మాజీ బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గుప్తా, బాన్స్వాడ మండల పార్టీ అధ్యక్షుడు మంత్రి గణేష్, తదితరులు పాల్గొన్నారు.