11-05-2025 07:12:20 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): దేశం కోసం తమ ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన జవాన్ మురళికి తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ అంబేద్కర్ చౌరస్తా మార్కెట్ ఏరియాలో జవాన్ ఎం మురళి నాయక్ ఆత్మ శాంతికి ర్యాలీ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. దేశం రక్షణ కోసం ప్రాణం తాగం చేసిన జవాన్ మురళీ అసమాన త్యాగాలను కొనియాడారు. మురళి నాయక్ కుటుంబానికి దేశమంతా అండగా ఉంటుందని ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రత్నం రాజన్న, రంగ రామన్న, గెల్లీ జయరాం యాదవ్, కందుల సత్తయ్య, కె నరసయ్య, వెంకటస్వామి, గంట శ్రీనివాస్, భోగ శ్రీనివాస్, గరిగె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.