18-10-2025 07:48:53 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ లోని గ్రీన్ వుడ్ సిబిఎస్ఇ పాఠశాలలో శనివారం ముందస్తు దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో విద్యార్థినీలు, మహిళా ఉపాధ్యాయులు ముగ్గులు వేసి, దీపాలను అలంకారించి,లక్ష్మీ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు టపాసులు కాల్చి, సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ చంద్రమోహన్ మాట్లాడుతూ ,విద్యార్థులలో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి దీపావళి పండుగ సంబరాలు నిర్వహించామని తెలిపారు. దీపావళి పండుగ సంబరాల్లో బాణాసంచాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దీపావళి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ నరకాసురుడు అనే రాక్షసుడు వధించబడిన సందర్భంగా ఆనందంతో ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు. లక్ష్మీదేవిని పూజించి, ఇంటిని ముఖ్యంగా ప్రవేశ ద్వారాలను రంగురంగుల ముగ్గులు, దీపాలతో అలంకరిస్తారని, బాణపంచా కాల్చి, సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ నాయుడు, ఏజియం పవన్ కుమార్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైన్ ప్రిన్సిపాల్ తిరుపతి, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.