18-10-2025 07:49:25 PM
కాటారం,(విజయక్రాంతి): కాటారం మండల సింగిల్ విండో డైరెక్టర్ అంకుసాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలి రాజాబాపు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంథని పట్టణంలోని రాజగృహలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రవికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జోడు శ్రీనివాస్, నాయకులు పంతకాని సడవలి,ఊర వెంకటేశ్వరరావు, వంగల రాజేందర్, జాడి శ్రీశైలం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.