calender_icon.png 19 October, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్టీలు కొట్టిన కారు

18-10-2025 07:47:22 PM

నిర్మల్ రూరల్: పట్టణంలోని కంచరుని కట్టపై శనివారం అదుపుతప్పి కారు పల్టీలు కొట్టడంతో ఐదురికి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబాను దర్శించుకుని వరంగల్ కు వెళ్తుండగా శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి చెరువు ఆనకట్ట చెట్లకు ఢీకొని ఆగడంతో ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. కారు చెరువులో పడి ఉంటే ఐదుగురు జల సమాధి అయ్యేవారు. స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.