18 April, 2026 | 1:04 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

కరివేపాకు తినండి

29-06-2025 12:00 AM

కరివేపాకును నిత్యం పలురకాల వంటల్లో వేస్తుంటాం. వంటకాల్లో వచ్చే కరివేపాకులను దాదాపుగా చాలామంది పడేస్తుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం చూస్తే కరివేపాకు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..

కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఈ ఆకులను తినకుండా విడిచిపెట్టలేరు. కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు. లేదా కరివేపాకుల రసాన్ని రోజూ నీటిలో కలిపి తాగవచ్చు. ఉదయం పరిగడుపునే గుప్పెడు కరివేపాకులను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. ఇలా కరివేపాకులను ఏ రకంగా తీసుకున్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

లాభాలు

కరివేపాకుల్లో ఆల్కలాయిడ్స్, మహానింబిన్, ముర్రాయనోల్, గ్లుకోసైడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు తదితర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్లు ఎ, బి, సి, ఇ కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. 

గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ సంబంధ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకులను తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. 

కరివేపాకుతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 

కరివేపాకులలో యాంటీ హైపర్ గ్లుసైమిక్ గుణాలు ఉంటాయి. అంటే ఇవి షుగర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయన్నమాట. కరివేపాకులను తింటుంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 

డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కరివేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. 

రోజూ కరివేపాకులను పరిగడుపునే తిం టుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. కరివేపాకుల్లో ఉండే ఫైటో స్టెరాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.