31 July, 2026 | 12:49 AM

పాడి పశువుల పెంపకంతో రైతుల ఆర్థికాభివృద్ధి

31-07-2026 12:21 AM
  1. పాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామి
  2. రెండోస్థానంలో తెలంగాణ
  3. ముల్కనూర్ సహకార బ్యాంక్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, జూలై 30 (విజయక్రాంతి): పాడి వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముల్కనూర్ సహకార బ్యాంక్ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు సహకార బ్యాంకులో పాడి పశువుల పోషణ యాజమాన్య పద్ధతులు నేటి దూడలే రేపటి పాడి పశువులపై ప్రొఫెసర్లు రవికుమార్, రాజన్న, రాజబాబు, సత్యప్రసాద్ రెడ్డి రైతులకు గురువారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో బ్యాంక్ అధ్యక్షులు మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణలో 42 లక్షల ఆవులు, 26 లక్షల గేదెలున్నాయని, దేశంలో తెలంగాణ పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం గోవర్ధన్ పథకం ద్వారా బయోగ్యాస్ తయారు కోసం ప్రణాళికలు ఏర్పాటు చేస్తుందన్నారు. ముల్కనూర్ సహకార బ్యాంక్ పాడి రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తుందన్నారు. ఈ అవగాహన సదస్సులో బ్యాంక్ జనరల్ మేనేజర్ మారుపాటి రామ్‌రెడ్డి, బ్యాంకు ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.