15-09-2025 12:30:18 PM
చిట్యాల (విజయక్రాంతి): పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల సుందర్ యాదవ్ అన్నారు. చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామానికి చెందిన ఈరమళ్ళ చంద్రకళ ఇటీవల అనారోగ్యానికి గురై ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది సంబంధిత పత్రాలతో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) వద్ద ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60 వేలు మంజూరు చేయించారు. ఈ మంజూరైన చెక్కును సోమవారం బాధితుని ఇంటికి వెళ్లి ఆవుల సుందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయాల్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వలిగొండ సోమయ్య, మెట్టు నాగ శంకర్, మెట్టు నరసింహ, దేశపాక మధు, రూపని గణేష్, పొలిమేర శంకర్, ఆకులు నరసింహ, అన్నెపు కార్తీక్, ఆవుల పెద్దలు, బొడ్డు రామలింగం, దేవరకొండ నవీన్, తదితరులు పాల్గొన్నారు.