15-09-2025 12:39:07 PM
సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మీరు చేసిన పని ఎల్లప్పుడూ పదిలంగా ఉండేలా నాణ్యతగా నిర్మించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలోని, రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర, యస్వీఎస్ ఎదురుగా ఉన్నటువంటి భరత్ నగర్ లో నూతనంగా వేస్తున్నటువంటి సీసీ రోడ్లను పరిశీలించి తగినంత నాణ్యతను పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నిబంధనల పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీల వాసులు తదితరులు ఉన్నారు.