calender_icon.png 15 September, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను కేటీఆర్ వెంటే ఉంటా: విష్ణువర్ధన్ రెడ్డి

15-09-2025 01:20:15 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ భవన్ లో వెంగళ్ రావు నగర్ డివిజన్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy ) మాట్లాడుతూ.. గతంలో చెప్పాను.. ఇప్పుడు చెప్తున్నాను.. నేను కేటీఆర్ ఎంటే ఉంటా.. కేటీఆర్ కు ప్రమోషన్ వస్తే.. రాజకీయంగా నాకూ ప్రమోషన్ వస్తుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేకపోయినా.. ప్రచారం చేసుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని ప్రజలు నిలదీస్తున్నారని ఆయన వెల్లడించారు.