calender_icon.png 15 September, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ 75వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు..

15-09-2025 01:18:07 PM

చిట్యాల (విజయక్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సోమవారం బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ కోరారు. భారతీయ జనతా పార్టీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం చిట్యాల వ్యవసాయం మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన సేవాపక్షం పట్టణ కార్యశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి చిట్యాల పట్టణ ఇంచార్జ్ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17న చిట్యాల కనకదుర్గ సెంటర్లో రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయాలనీ, అలాగే సెప్టెంబర్ 27న దివ్యాంగులకు వారి ప్రతిభను గుర్తించి సన్మానం చేయాలని తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి బూత్ లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, సెప్టెంబర్ 17న  విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూతులో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు.

సెప్టెంబర్ 18న స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించాలని, అక్టోబర్ 2 తేది న గాంధీ జయంతి, లాల్ బహుదూర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచారు. అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ మునిసిపల్ కేంద్రం లో గల అన్ని వార్డ్ లలో  ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, చిట్యాల పట్టణ కేంద్రలో  అనేక సేవ కార్యక్రమం లు  చేస్తు, రాబోయే మునిసిపల్  ఎన్నికలలో అన్ని వార్డ్ లలో పోటీ చేసి గెలిచే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సేవ పక్ష పట్టణ కన్వినర్ గా చికిలంమెట్ల అశోక్ ని, కో కన్వినర్ గా జయరాపు రామ కృష్ణ ని జిల్లా పార్టీ నియమించిందని పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్  తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ  రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకుడు కన్నీబోయన మహాలింగం, మాజీ జిల్లా కార్యదర్శి బోడిగే అశోక్, బీజేపీ నాయకులు కునూరు సంజయ్ సంజయ్ దాస్,  పల్లె వెంకన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి కందటి చంద్ర రెడ్డి, సుంచు శ్రీను, ఈడుదల మల్లేష్, కన్నీబోయన మురళి, దామరోజు నాగరాజు, వైరాల రాహుల్, బెల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.