15-09-2025 12:46:41 PM
హైదరాబాద్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి(Visvesvaraya Jayanti 2025) రోజున జరుపుకునే జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర అపూర్వమని, వారి సృజనాత్మక ఆవిష్కరణలే జాతికి మార్గదర్శనం చేస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రత్యేకతను చాటారని కొనియాడారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు. మూసీ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించారని గుర్తుచేశారు.