calender_icon.png 20 July, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్స్ కేసు గూగుల్, మెటాలకు ఈడీ నోటీసులు

20-07-2025 01:17:43 AM

  1. మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలతో కేసు నమోదు
  2. సెలబ్రిటీలపై విచారణ ముమ్మరం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సం బంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు పంపింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

యూట్యూబ్, ఇన్‌సా గ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, షేర్‌చాట్, స్నాప్‌చాట్ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ యాప్స్‌ను సెలబ్రిటీలు విపరీతంగా ప్రమోట్ చేసినట్లు ఈడీ గుర్తించింది.  దర్యాప్తులో భాగంగా సదరు టెక్ కంపెనీలకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యా ప్‌ల ద్వారా మనీలాండరింగ్, హవాలా లా వాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రా వడంతో ఈడీ కేసు నమోదు చేసింది.

అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు తమ మా ధ్యమాల్లో ఇలాంటి యాప్‌లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడ మే కాకుండా, వాటి వెబ్‌సైట్‌ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. 

ఎంతోమంది ఆత్మహత్యలు..

రాష్ట్రలో బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎం తో మంది జీవితాలు నాశనమయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ జూదాన్ని విచ్చలవిడిగా ప్రమోట్ చేయడంతో ప్రజలు ఆకర్షితులై, వాటిలో డబ్బు లు పెట్టి లక్షలాది రూపాయలు నష్టపోయా రు. దీంతో బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ప్రమోటర్స్‌గా ఉన్న సినీ సెలబ్రిటీలు, యూ ట్యూబర్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసింది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే టాలీవుడ్ నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ, శ్రీముఖి వంటి వారిపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మొత్తం 29 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌పై ఈడీ విచారణ జరపనుంది. గతంలో వీరిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదులు అందాయి.