కేరళ మాజీ సీఎం ఇంటిపై ఈడీ సోదాలు సిగ్గుచేటు
రాజకీయ కక్ష సాధింపు చర్య సరికాదు
బెదిరింపులకు బెదరం: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి శశిధర్
సిద్దిపేట, మే 28(విజయక్రాంతి): కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వినరాయి విజయ్ ఇంటిపై ఈడి దాడులు నిర్వహించడం సిగ్గుచేటనీ, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని ఈడి సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అన్నారు.
కేరళ మాజీ సీఎం పినరాయి విజయ్ ఇంటి పై ఈడి దర్యాప్తుల సంస్థ దాడులు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ అర్బన్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ చౌరస్తాలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా రాళ్ల బండి శశిధర్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో సిపిఎం పరిపాలనలో అనేక రంగాలలో ఆదర్శవంతమై న పరిపాలన అందించిందని ప్రపంచ దేశాలలో మొట్టమొదటిసారిగా పేదరికం నిర్మూలించినటువంటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రాన్ని నిలబెట్టిన దాంట్లో సిపిఎం పరిపాలన దానికి నిలువుటద్దమని దీన్ని ఓర్వలేని బిజెపి ప్రభుత్వం కేంద్రంలో దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఎలాంటి అవినీతి మరకలు లేని నీతి నిజాయితీ కలిగిన నీరాడంబరకు నిలబడద్దంగా నిలిచిన విజయన్ కి మచ్చ తీసుకురావాలని ఉద్దేశంతో రాజకీయ కక్ష సాధింపులు సాధించాలని దురుద్దేశంతో కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపి బిజెపి తన కక్ష సాధింపు చర్యలు పూనుకుందని ఇలాంటి బెదిరింపులకు సిపిఎం లొంగబోదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట అర్బన్ మండలం కార్యద ర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు జాలిగాపూర్ శిరీష, దాసరి ప్రశాంత్, అర్బన్ నాయకులు చెప్పాలా బాలమణి, కొండ సంజీవ్ కుమార్, బత్తుల అభిషేక్ బాన్, పాండు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.






