31-07-2024 02:57:13 PM
హైదరాబాద్: మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ జరుగుతోంది. హైదరాబాదులోని ఆరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్, ఎండి పురుషోత్తం దాస్ తోపాటు సీఈవో డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. నకొతా ఫోర్జరీ పత్రాలతో అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలున్నారు.