కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
ధ్రువీకరించిన భారత రాయబార కార్యాలయం
కువైట్, జూన్ 3: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఒక భారతీయుడు మృతి చెందాడని, మరో 63 మందికి గాయాలయ్యాయని బుధవారం భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. గల్ఫ్‌లో ఘర్షణలు మరోమారు తీవ్రమవుతున్న సమ యంలో ఈ దాడులు జరిగాయి. ఇరాన్ కువైట్, బహ్రెయిన్‌లోని లక్ష్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుండగా, అమెరికా హో ర్ముజ్ జలసంధి సమీపంలో సైనిక చర్యలు చేపట్టింది.
ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో విమానాశ్రయంలోని సౌకర్యాలు, దౌత్య కార్యాలయాలు దెబ్బతిన్నాయి. దాడుల నేపథ్యంలో విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నష్టాన్ని అంచనావేసి, భద్రతా చర్యలను చేపట్టి తిరిగి విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని కువైట్ మంత్రిత్వ శాఖ ప్రకటిం చింది. బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరం, హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నామని బహ్రెయిన్ సైన్యం ప్రకటించింది. కువైట్‌పై ప్రయోగించిన రెండు క్షిపణులు మార్గమధ్యంలోనే ముక్కలయ్యాయని అమెరికా ప్రకటించింది.






