పినరయి వీణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు
రెండు సంస్థల్లో హవాలా లావాదేవీలు గుర్తింపు
తిరువనంతపురం, ఆగస్టు 23: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె టి. వీణ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తుండడంతో ఆమె, సీపీఐ (ఎం)నేతలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆగస్ట్ 18న పలు ప్రాంతాల్లో జరిగిన ఈడీ దాడులపై ఓ అధికారి ఆదివారం విషయాన్ని బయట పెట్టాడు. ఈ హవాలా అవినీతి అంశం కాస్త ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో కూడా భయాందోళనలను రేకెత్తిస్తుంది. వీణకు చెందిన ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్’ సంస్థలలో లంచం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు,
ఆమె భర్త పీఏ మహమ్మద్ రియాస్ స్వస్థలమైన కోజికోడ్‌లో, సీపీఐ (ఎం) యువజన విభాగం నాయకుడు ఎన్. నందులాల్, జిల్లా కార్యదర్శి నిఖిల్, మరికొంతమందిపై దాడులు చేశామన్నారు. విజయన్ సీఎంగా కొనసాగుతున్నప్పుడు వీణ ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు ఎటువంటి పనులు చేపట్టకుండానే రూ. 2.78 కోట్లను తమ బ్యాంకు ఖాతాలకు మళ్లించుకున్నాయని, ఇందులో రూ. 85 లక్షలను దుబాయ్‌లోని ఖాతాకు పంపించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా వీణ నమోదయ్యారని చెప్పారు. సహచరుల ఖాతాల ద్వారా రూ. 20.5 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. ఈడీ చర్య కక్ష్యపూరితమని పార్టీ వర్గాలు ఆరోపించాయి.






