13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఏడుపాయలకు బయలుదేరిన సంస్థానాధీశుల జోడెడ్ల బండి..

16-02-2026 11:46 AM

జన సందోహంతో సాగనంపిన గ్రామస్తులు

పాపన్నపేట,ఫిబ్రవరి16: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో(Sri Edupayala Vana Durga Bhavani Devalayam) మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహించే సంగతి తెలిసిందే. ఇట్టి జాతరలో రెండవ రోజైన సోమవారం ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా జరుగుతుంది.

జాతరలో పాపన్నపేట సంస్థానాధీశుల జోడేడ్ల బండి మొదటగా నడవగా వాటిని అనుసరిస్తూ మిగతా బండ్లు జాతరలో ముందుకు సాగుతాయి. అయితే సోమవారం ఉదయాన్నే పాపన్నపేట గ్రామస్తులు ఘనంగా ఊరేగింపు నిర్వహించి జాతర మహోత్సవానికి జోడెడ్ల బండిని సాగనంపారు. సాయంత్రానికి ఏడుపాయలకు చేరుకున్న సంస్థానాదిశుల బండికి ఈవో వీరేశం, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం జోడెడ్ల బండ్ల ఊరేగింపును అట్టహాసంగా నిర్వహిస్తారు. బండ్ల ముందు డప్పు చప్పుల్ల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు.