13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి చేరుకున్న వార్డు సభ్యులు

16-02-2026 11:55 AM

ప్రమాణస్వీకారం చేయించిన అధికారులు

చైర్మన్ ఎవరనేది ఉత్కంట భరితం

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లు చేరుకున్నారు. వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.మూడు రోజుల పాటు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే మదన్మోహన్తో  కలిసి సోమవారం 11 గంటల కు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయంలోని సమావేశం హాల్లోకి వెళ్లి కుర్చీలపై కూర్చున్నారు. ఎల్లారెడ్డిలో  వివిధ పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

గంట సమయం గడిస్తే చైర్మన్ ఎవరనేది తేలనుంది.

మరికాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల ఎన్నిక నిర్వహించనున్నారు. ఛైర్మన్ అవకాశాలు పద్మ శ్రీకాంత్కు ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరి కాసేపట్లో అధికారికంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక  జరగనుంది. కాగా.. పద్మ శ్రీకాంత్ గతంలో సైతం మున్సిపల్ ఛైర్మన్గా పని చేశారు. తొలి ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం నెగ్గడంతో.. పద్మ శ్రీకాంత్ ఛైర్మన్ అయిన విషయం తెలిసిందే. మరోసారి ఆయనకు అవకాశం వస్తుందో లేదో కాసేపట్లో తేలనుంది.