పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకున్న విద్యాశాఖ
హైదరాబాద్ : విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో వందేమాతరం, జీతీయగీతం లేకుండా పాఠ్య పుస్తకాలు ఇవ్వడం వివాదాస్పదమైయింది. దీంతో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, వర్క బుక్స్ ను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పాఠ్య పుస్తకాల్లోని ముందు మాట పేజీలో పొరపాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పూర్వ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కొంతమంది అధికారుల పేర్లను పేర్కొంటూ ముద్రించారు. దీంతో ఆ పేజీ చింపేసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. అయితే అధికారులు ఆ పేజీని తొలగించి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాడంతో వెనుకవైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ లేకుండానే పుస్తకాలు పిల్లలకు పంపిణీ చేశారు.






