23 August, 2026 | 4:34 AM

తెలంగాణలో ఎల్లో అలెర్ట్... పలు ప్రాంతాల్లో వర్షం

13-06-2024 03:39 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగరంతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్ష కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.