16 April, 2026 | 9:08 AM

నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడు ఏపూరి బ్రహ్మం

22-12-2025 12:00 AM
  1.  కార్మిక వర్గానికి అండగా ఉన్నదే కమ్యూనిజం
  2. మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతాలు పోవు: కూనంనేని 

ఇల్లెందు, డిసెంబర్ 21,(విజయక్రాంతి): నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు నిలబడిన అసలైన కమ్యూనిస్టు ఏపూరి బ్ర హ్మం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూ డెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం ఇల్లందు పట్టణంలోని జె కె కాలనీ వద్ద ఏపూరి బ్రహ్మం మొదటి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్థూప ఆవిష్కరణ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే. సారయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎ మ్మెల్యే కూనం నేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ ఇల్లందు ప్రాంతంలో ఏపూరి బ్రహ్మం పట్టుదల, ప్రేమ, పోరాట పటిమ కలిగిన నాయకుడని తన చివరి శ్వా స వరకు కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. కమ్యూనిస్టు అనేవాడు ఒక్కడు ఉన్నా సరే నిజాయితీగా ఉండి ఆ పార్టీ కృషికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు.

కమ్యూనిస్టుల పట్ల అభిమానం, విశ్వసనీయ త ఉన్న దానిని మనం ఓట్లగా మల్చలేక పో తున్నామని అన్నారు. కార్మిక వర్గానికి అండ గా ఉన్నది కమ్యూనిస్టులు మాత్రమేనని, నాడు సంఘటిత రంగంలో కార్మికులు, నేడు అసంఘటిత రంగ కార్మికులుగా మారారని వారి అభిరుచికి తగ్గట్టుగా కమ్యూనిస్టులు మారి వారిని కమ్యూనిజం వైపు నడిపించాలన్నారు.2026 మార్చి 31 వరకు మావో యిస్టు లందరిని అంతం చేస్తానని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావో యిస్టులను మాత్రమే చంపగలడని ప్రజల గుండెల్లో ఉన్న వారి మావోయిజం చంపలేడన్నారు.

కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కమ్యూనిస్టు ఉనికిని కాపాడుకోవాలన్నారు. దేశం లో కమ్యూనిస్టులు మాత్రమే పేద ప్రజల కోసం పోరాడి వారి హక్కులను కాపాడారని ఆదర్శ కమ్యూనిస్టులు పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలన్నారు. ప్రస్తుతం భారతదేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హ క్కులను కాలరాస్తుందని, దేశ సంపదను కా ర్పొరేట్లకు దోచిపెడుతుందని, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చే స్తూ బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించి కార్మికుల మోసం చేస్తుందన్నారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లే కుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులకు యూరియా సరైన సమయా నికి అందించకుండా ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది అన్నారు. రానున్న రోజుల్లో బిజె పి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ పార్థసారథి, రాష్ట్ర నాయకులు పోటు కళావతి, ఏపూరి లతా దేవి, ముత్యాల విశ్వనా థం, తాటి వెంకటేశ్వరరావు, సింగు నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవర కొండ శంకర్, బంధం నాగయ్య, మండల పట్టణ కార్యదర్శులు బొప్పిశెట్టి సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.