calender_icon.png 22 December, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

22-12-2025 12:00:00 AM

రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి

మణుగూరు,డిసెంబర్21,(విజయక్రాంతి) : సీపీఐ పార్టీ ఆవిర్భవించి సీపీఐ డిసెంబరు 26 నాటికి 101 ఏళ్ళు పూర్తవుతాయ ని, ఈ సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో  సీపీఐ మండల కార్యవర్గ సభ్యుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరూరా, వాడవాడ నా సీపీఐ జెండాలు ఎగుర వేయాలన్నారు. పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించాలన్నారు.ర్యాలీలు, సభలు, సెమినార్లు, నిర్వహిస్తూ, జన సేవాదళ్ క్యాంపులు నిర్వహించే జాతాను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో వేడుకలు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచి పోరాడేది సీపీఐ అని ప్రజలకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో మున్న  లక్ష్మీకుమారి, జంగం మోహన్ రావు, ఆర్ లక్ష్మీనారాయణ, దుర్గ్యాల సుధాకర్, వై రాంగోపాల్, ఎడారి రమేష్, మంగి వీరయ్య పాల్గొన్నారు.