22-12-2025 12:00:00 AM
న్యాయమూర్తి సూరి రెడ్డి
మణుగూరు,డిసెంబర్21(విజయక్రాంతి) : స్వల్ప వివాదాలకు సైతం కోర్టుల చుట్టూ తిరగడం ద్వారా కక్షిదారులు తమ విలువైన కాలాన్ని, ధనాన్ని, శ్రమను వృథా చేసుకోవద్దని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కంబపు సూరిరెడ్డి తెలిపారు. రాజీ ద్వారా వివాదాలు పరిష్కారమై ప్రశాంత జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆదివారం కక్షిదారులతో నిర్వహించిన న్యాయచైతన్య సదస్సుకు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వివాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకు న్నట్ల యితే ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇప్పటికే చెల్లించిన కోర్టు ఫీజులు సైతం తిరిగి పొందవచ్చని సూచించారు. లోక్ అదాలత్లో 1,177 కేసు లు పరిష్కారం కాగా, వివిధ కేసులలో ముద్దాయిలు నేరం అంగీకరించి రూ.1, 57,200 జరిమానాను కోర్టుకు చెల్లించారు. న్యాయవాదులు చిర్ర సరస్వతి,విజయరావు, శ్రీనివాసరావు, భాస్కర్, వెంకట్, రాము, రమేష్ బాబు, బెంచ్ క్లర్క్ సామ్రాజ్యం శ్రీకర్, కోర్టు కానిస్టేబుళ్లు బుచ్చిబాబు, శ్రీనివాస్, పాల్గొన్నారు.