10 May, 2026 | 3:55 AM

బైంసాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

05-02-2025 07:06 PM

భైంసా (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి నివసిస్తూ మాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం బైంసా పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆ సంఘం నాయకులు ధ్వజమెత్తారు. తీర్మానంపై ప్రభుత్వం పునారాలోచన చేయాలని లేని పక్షంలో మాల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.