19-12-2025 09:51:49 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం, నిత్య అవసరాల కోసం నిత్యం పోరాడుతున్న ఫర్ ఎ బెటర్ సొసైటీ చేసిన ప్రయత్నం ఫలించిందని ఫర్ ఎ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు జస్వంత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రగతి నగర్ పరిధిలో ఉన్న అంబీర్ చెరువు కలుషితమవ్వడం, స్మశాన వాటికలో వ్యర్ధాలను వేసి ప్రజలను అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఉప్పు జస్వంత్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన ఒక్క రోజులోనే స్పందించిన హైడ్రా కమిషనర్ దర్యాప్తు చేయమని హైడ్రా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నలుగురు హైడ్రా సిబ్బందిని అక్కడే ఉండేలా నియమించారు. నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, హైడ్రా బృందాలు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటామని ఫర్ ఎ బెటర్ సొసైటీ కి తెలియజేశారు.