23-02-2026 09:21:28 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రైతులకు అవగాహన కొరకై ఎంపీడీవో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అజోల్ల తొట్టి నిర్మాణం నందు హజుల్లా విత్తనాలను చల్లడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో బైరు మల్లేశ్వరి మాట్లాడుతూ.. అజుల్లా పెంపకం వలన రైతులకు చాలా లాభదాయకం కలిగి ఉంటుందని, అజోల్లోను పాడి పశువులకు, కోళ్లకు, మేకలు, గొర్రెలకు దానగా ఉపయోగించవచ్చన్నారు.
ఈ తొట్టి నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకంలో రూ.18 వేలు మంజూరు చేయబడుతుందని తెలిపారు. రైతులకు అవగాహన కొరకై టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సొంత ఖర్చులతో అజోల్లా తొట్టిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో శ్రీనివాస్, ఇసి తిరుపతయ్య, సాంకేతిక సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, మహేష్, ఉమామహేశ్ లు, రైతులు పాల్గొన్నారు.