దురుసుగా మాట్లాడిన తహసిల్దార్‌పై చర్యలు తీసుకోవాలి
కానుగు సైదులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులు దురుసుగా అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.పొనుగోడు గ్రామానికి చెందిన కానుగు సైదులు, పెద్దవూర పాఠశాల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. సోమవారం తహసిల్దార్ సంతకం కోసం క్యాబిన్‌లోకి వెళ్లిన సమయంలో తాసిల్దార్ స్రవంతి తనపై కోపంగా నిర్లక్ష్యంగా మూసుకో అంటూ అసభ్యకరంగా మాట్లాడి కించపరిచారని సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటిఆర్ సర్టిఫికెట్ గడువు ముగిస్తుందని అత్యవసరమని వేడుకున్నప్పటికీ, తగిన స్పందన రాలేదని పేర్కొన్నారు. కార్యాలయ సమయాల్లో అధికారుల ప్రవర్తన ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని ఆయన అన్నారు.దురుసుగా మాట్లాడిన తహసిల్దార్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సేవలో ఉన్న అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.






