23-02-2026 09:28:47 PM
మండలంలోని 162 మందికి రూ. 1 కోటి 62 లక్షల ఆర్థిక సాయం అందజేత
కుభీర్,(విజయక్రాంతి): ఆడబిడ్డల పెండ్లిల్లు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష 116 చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా దశలవారీగా అన్ని సమస్యలను నెరవేర్చేందుకు తలవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శివరాజ్, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, ఆత్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ లు సిద్ధం వార్ వివేకానంద, గోనే కళ్యాణ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.