calender_icon.png 19 December, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బెతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు

19-12-2025 09:48:39 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ 53వ డివిజన్ లస్కర్ సింగారంలోని  బెతేస్తా బాప్టిస్ట్ చర్చిలో కాంగ్రెస్ నాయకులు మట్టెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు విష్ణురెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అనిల్ ఏర్పాటుచేసిన దుస్తులను పాస్టర్ కుటుంబ సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, ఐక్యత, సేవా భావనలే క్రిస్మస్ సందేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కనకం కిరణ్, స్థానిక సంఘ కాపరి ఉదయ్ శామ్యూల్, ప్రెసిడెంట్ వై. అబ్రహం, వైస్ ప్రెసిడెంట్ దామర శంకర్, సంఘ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు ఎర్ర మహేందర్, బాబా బాయ్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.