calender_icon.png 23 February, 2026 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిపాప మృతి కారకులను కఠినంగా శిక్షించాలి

23-02-2026 09:24:38 PM

రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

మణుగూరు,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్‌ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడిచేసి, రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం  పట్టణంలోని సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ కూడలి వరకు బీసీ జేఏసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో పసిపాప మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ... రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంతో మల్లన్న దేవుని దర్శనానికి వెళుతుండగా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు అడ్డుకొని, రెండు నెలల పసికందు ఉందని కూడా చూడకుండా దాడికి పాల్పడటంతో పాప మృతి చెందిందన్నారు. ఇందుకు కారకు లైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.నిరసన కు బీసీ సంఘాలు, టీఆర్పీ పార్టీ మద్దతు తెలిపారు.