1 August, 2026 | 2:03 AM

మరోసారి సర్ గడువు పొడిగింపు

01-08-2026 01:17 AM

ఆగస్టు 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువును మరోసారి పెంచుతూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 10వ తేదీకి పొడిగించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సుద ర్శన్‌రెడ్డి ప్రకటించారు. తొలుత ఈ గడువు జూలై 24వ తేదీ వరకే ఉండగా దానిని ఆగస్టు ౩ వరకు గతంలో పొడిగించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీ కరణ, పునర్వవ్యస్థీకరణకు గడువు ఆగస్టు 10గా నిర్ణయించారు.

ముసాయిదా ఓట రు జాబితా ప్రచురణ ౧౫వ తేదీన జరుగుతుంది. క్లెయి మ్డ్ అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 1౭ నుంచి సెప్టెంబర్ ౧౬ వరకు ఉంటుంది. తుది ఓటరు జాబితా అక్టోబర్ ౧౨న ప్రచురిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యా ప్తంగా ౭౭.౧౨% ఎన్యుమరేషన్ పూర్త యింది. హైదరాబాద్ జిల్లాలో ౫౬. ౩౧%, రంగారెడ్డిలో ౬౩.౪౩%, మేడ్చల్ జిల్లాలో ౬౧.౩౭% పూర్తయినట్లు ఈసీఐ తెలిపింది.