1 August, 2026 | 1:53 AM

ప్రజల భద్రత కోసం పనిచేసిన వారికి గుర్తింపు

01-08-2026 01:20 AM

నిర్మల్ జులై 31 (విజయక్రాంతి): ప్రజల భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన పోలీసు సిబ్బంది సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్బీ ఎస్త్స్ర నర్సయ్య, నిర్మల్ టౌన్ ఏఎస్త్స్ర తారాచంద్, బాసర ఏఎస్త్స్ర గంగాధర్, లక్ష్మణచందా పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శంకర్ లను పూలమాల శాలువాతో సత్కరించి అభినందించారు.

పోలీసు శాఖ అభివృద్ధికి వారు అందించిన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసే బాధ్యతాయుతమైన సేవ అని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ విధులకు మాత్రమే ముగింపు అని, సమాజ సేవకు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ టౌన్ సీఐ సమ్మయ్య, రూరల్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.