08-07-2025 11:04:57 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిక్కనూరు మండలం లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలోని కీర్తిశేషులు కొత్త ఎల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్ ను ఎమ్మెల్సీ ప్రజా కవి గోరేటి వెంకన్న(MLC Prajakavi Goreti Venkanna) మంగళవారం లక్ష్మీదేవునీ పల్లి గ్రామానికి చేరుకొని ప్రారంభించడం జరిగింది. అనంతరం రెడ్డి ఫంక్షన్ సభలో ప్రజా కవి గోరేటి వెంకన్న మాట్లాడుతూ... లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చేరుకోవడం పల్లెల ప్రకృతి మంచిదనం మంచి మనసు ఐక్యత కలిగినట్టి లక్ష్మీ దేవునిపల్లి గ్రామ ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో ఎటు చూసినా హద్దురాళ్ళు వెంచర్లతోని నిండిపోయిన పల్లె గ్రామాల్లో ఈ గ్రామంలో ఇంకా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల కతీతంగా కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి ప్రశాంతంగా ఉన్న లక్ష్మీ దేవునిపల్లి గ్రామ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
కొత్త నర్సింలు గారి నాన్న జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్ ఆలోచన గొప్పదని ఈ విధంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు. కోల్గేట్, బ్రేష్ సబ్బులు కార్మికులు రైతులకు సంబంధించిన అసమానతనలు ప్రజలకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో నేను పర్యటించిన గ్రామాల్లో ఇటువంటి మంచి మనసున్న గ్రామాన్ని మొదటిసారి చూస్తున్నాను అన్నారు. మానవ విలువలు దూరమవుతున్నాయని ఆస్తుల కోసం తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారని, చంటి పిల్లలు మహిళలు సైతం వేధింపులకు గురి చేసి చంపుతున్నారని ఇదేమి లేని సమాజాన్ని చూడాలన్నారు.
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నంద రమేష్, ప్రముఖ న్యాయవాది క్యాతం సిద్ధ రాములు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ విడిసి అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డం నరేందర్ రెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొత్త సిద్దయ్య, బీసీ వడ్డెర సంఘం అధ్యక్షులు నర్సింలు, వృద్ధాప్య సంఘ అధ్యక్షులు నర్సారెడ్డి, పాలకేంద్రం మాజీ అధ్యక్షులు హనుమంతు నర్సారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.