02-05-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే1 (విజయ క్రాంతి): జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా 100 శాతం అక్షరాస్యత సాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో నవభారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
కేంద్ర ప్రయోజిత పథకాలతో ఉల్లాస్, నవభారత్ సాక్షరతా కార్యక్ర మంలో భాగంగా పాఠశాల విద్యావకాశం కోల్పోయిన 15 సంవత్సరాలు ఆ పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత, కీలకమైన జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తిని నైపుణ్యాలతో నిరంతరం విద్య ను అందించడమే లక్ష్యమని తెలిపారు. వయోజనులకు విద్య అందించేందుకు స్వ చ్ఛంద బోధకులు అవసరమని, అవగాహన లో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం, కనీస సామర్ధ్యాలతో కూడిన లెక్కలు చేయడం వంటివి బోధించడం జరుగుతుందని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో చది వే విద్యార్థులు తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం, ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలో చేరే విధంగా విద్యాశాఖ అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బడి వయసు గల పిల్లలు ఎవరు బడి బయ ట ఉండకూడదని, అక్షరాస్యతలో జిల్లా ను ముందు వరుసలో ఉండే విధంగా అందరం సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ విద్యాధికారి యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బానోత్ దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకా రాం, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతిరామ్, విద్యాశాఖ అధికారులు ఉదయ్ బాబు, మధుకర్, శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.