02-05-2025 05:26:37 PM
అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి వేదికగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని(Amaravati Reconstruction Program) ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్వహిస్తుంది.ఈ వేడకకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ... ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని, గతంలో ప్రధాని మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని, మళ్లీ మోదీ చేతుల మీదుగానే రాజధాని పునర్నిర్మాణ పనులను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు.
గతంలో ప్రధానిని ఎప్పడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని, ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారని, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండంగా ఉంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మోదీజీ.. మేమంతా మీకు అండగా ఉన్నాం అని, వందేమాతరం.. భారత్ మాతాకి జై అంటూ సీఎం చంద్రబాబు నినాదాలు చేసి ప్రజలతోనూ చేయించారు. సరైన సమయంలో.. సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం భారత్ ఐదో స్థానానికి ఎదిగిందని వ్యాఖ్యానించారు.
త్వరలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని, 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఒక వైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషి చేస్తున్నారని, దేశాభివృద్ధే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని ఈ సందర్భం ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు. కులగణన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని, అది గొప్ప నిర్ణయమని కూటమిగా పోటీ చేసి 93 శాతం స్టైక్ రేట్ తో విజయం సాధించామని చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సహయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.