15 April, 2026 | 7:58 AM

హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి

11-01-2026 12:14 AM

ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

ముషీరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వు కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భోలక్ పూర్ డివిజన్ దేవుని తోటలోని భవాని శంకర ఆలయంలో శివలింగానికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఆలయంలో శివలింగానికి పూజలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భరత్ గౌడ్, రమేష్ రామ్, కార్పొరే టర్ రచన శ్రీ, బీజేపీ మీడియా సెల్ ఇంచా ర్జ్ బిజ్జి కనకేష్ కుమార్, ఓబిసి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జమాల్పూర్ నందు, సదానంద ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లంపల్లి రాంరెడ్డి, దళిత మోర్చా  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందగిరి నరసింహ, బొల్లాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, బబ్లు అడిగ్మెంట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.