11-01-2026 12:14:09 AM
హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్న మాజీ మంత్రి
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం వచ్చింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే ‘23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్’లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను కోరారు. ‘ది ఇండి యా వీ ఇమ్యాజిన్’ అనే థీమ్‌తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సి టీ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు.
ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల ఆధ్వర్యంలోని ఇండియా కాన్ఫరెన్స్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారత్‌తో పాటు దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు కలిపి వెయ్యిమందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.
తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన కీలక పాత్రకు గాను హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నది. ఈ ఏడాది కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 14న హార్వర్డ్ కెనెడీ స్కూల్లో పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీపై, ఫిబ్రవరి 15న హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో వ్యాపారం, ఆంట్రప్రెన్యూర్షిప్, గ్లోబల్ ఎకానమీపై చర్చలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15న జరిగే చర్చల్లో ప్రసంగించాలని నిర్వాహకులు కోరారు.