calender_icon.png 12 January, 2026 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం

11-01-2026 12:15:25 AM

మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలవాలని నిర్ణయం

హైదరాబాద్, జనవరి 10(విజయక్రాంతి): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చే యాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించిం ది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలో నిలిపేందుకు సిద్ధమైం ది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యాచరణను ప్రారంభించింది.

ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావజాలాన్ని, అయిన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబందాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నామని తాళ్ళూరి రామ్ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని రామ్ పిలుపునిచ్చింది. కాగా తెలంగాణ జనసేన యువజన విభాగం అడ్‌హక్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ సభ్యులకు ఈ శిక్షణ ఇచ్చారు.