15 March, 2026 | 10:53 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

భూ భారతి చట్టంపై సందేహాల నివృత్తికి కృషి

24-04-2025 01:25 AM

మంథనిలో భూ భారతి చట్టం అవగాహనలో కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం  పై రైతులకు ప్రజలకు ఉన్న సందేహాలను పూర్తిస్థాయిలో నీ వృత్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

బుధవారం మంథని  మండలంలోని నాగారం రైతు వేదిక వద్దనిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్  చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి  సురేష్, మంథని తహసిల్దార్ కుమార స్వామి, రైతులు, ప్రజా ప్రతినిధులు,  వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.