11 August, 2026 | 5:37 PM

Breaking News

ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •  

పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలకు అభినందనలు

24-04-2025 01:24 AM

తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి

హనుమకొండ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలను బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి  సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొ.బి.చంద్రమౌళి వారికి పుష్పగుచ్ఛం అందించి కళాశాలకు  సాదరంగాఆహ్వానించారు. కళాశాలలోని వివిధ విభాగాలు, కంప్యూటర్ విభాగం తరగతి గదులు, బాటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ మొదలైన సైన్సు ల్యాబ్లు, లైబ్రరీ, ఆడిటోరియం మొదలైనవి వారికి ప్రిన్సిపాల్ చూపించారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిది జాతీయ సదస్సులు నిర్వహించామనీ   తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ కళాశాలోని సైన్స్ లాబ్లు ,లైబ్రరీ,ఆడిటోరియం చాలా బాగున్నాయని ప్రశంసిస్తూ, కళాశాల పనితీరును మెచ్చుకుంటూ ప్రిన్సిపాల్, స్టాఫ్ ను అభినందించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వివిధ అధికారులతో జరిగిన రివ్యూ  సమావేశంలో పింగిళి కళాశాలోని వసతులు, లైబ్రరీ, ఆడిటోరియం మొదలైనవి చాలా బాగున్నాయని అన్నారు. పింగిళి కళాశాల చరిత్ర విభాగం జాతీయ సదస్సు పరిశోధ న పత్రాల ఐ ఎస్ ఎస్ ఎన్ యూ జీసీ కేర్ జర్నల్ ను ఆకునూరి మురళి చేతుల మీదుగా ఆవిష్కరించారు. తదనంతరం కళాశాల అదనపు తరగతుల నిర్మాణం,వసతుల కల్పనకోసం వారికి వినతి పత్రాన్ని అందజేశారు.

కార్యక్రమంలో హనుమకొండ జిల్లా విద్యాధికారి డి.వాసంతి, కో ఆర్డినేటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ రెడ్డి, ఎం ఈ ఓ నెహ్రూ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా. సురేశ్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ డా.అరుణ, అధ్యాపకులు డా. హెప్సిబా, మధు, డా. కె.శ్రీనివాస్, డా.సారంగపాణి, డా. ప్రవీణ్ కుమార్, సుజాత, సువర్ణ, రత్నమాల, డా. రేణుక, వివిధ విభాగాల అధిపతులు,భోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.