15 March, 2026 | 9:34 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఏపీ ఎస్సెస్సీ ఫలితాల్లో భాష్యం జోరు

24-04-2025 01:25 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఏపీ ఎస్సెస్సీ ఫలితా  ల్లో భాష్యం విద్యార్థులు 600కి 600ల మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించి చరిత్ర సృష్టించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన గుంటూరులోని చంద్రమౌళీనగర్ భాష్యం మెయిన్ క్యాంపస్‌లో ఉత్త మ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా రామ కృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థిని వై నేహాంజని 600కి 600 మార్కులు సాధించి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత అత్యధిక మార్కులు రావడం ఇదే ప్రథమమని తెలిపారు.

599 మార్కులు వచ్చిన కే ప్రేమ, సత్య లిఖిత, కే హర్షిత, పీవీఎస్‌స్ శ్రీహాసిని 598, ఎస్ షాలిని సంహిత 598 మార్కులు, ఎం ప్రియజోషిని 598 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కులను 205 మంది, 580 ఆ పైగా 952, 570ఆ పైగా 1,888, 550 పైగా 3,584, 500 ఆ పైగా 6,634 మంది విద్యార్థులు సాధించారన్నారు.

మ్యాథ్స్ 100కు 100 సాధించిన విద్యార్థులు 1,088, 95ఆ పైగా 3,223, 90 ఆ పైగా 4,067 మంది, సైన్స్‌లో 100కు 100 సాధించిన విద్యార్థులు 724, 95 ఆ పై 4,331, 90 ఆ పైగా 6,685 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఘన విజయానికి తోడ్పడిన వారందరికీ చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు అభినందనలు తెలిపారు.