23 June, 2026 | 11:39 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఖమ్మం రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి

22-10-2024 12:47 AM

ఎంపీ రఘురాంరెడ్డి 

ఖమ్మం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఖమ్మం రైల్వేస్టేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఖమ్మం ఎంపీ రామస హాయం రఘురాంరెడ్డి అన్నారు.  సోమవా రం ఆయన రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, ఎలివేటర్, ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని పరిశీలించారు.

పనులు నాణ్యతతో జరిగేలా నిత్యం పర్యవేక్షించాలని అధి కారులకు సూచించారు. వాహనాల పార్కిం గ్ సమస్య పరిష్కారానికి స్టేషన్ సమీపంలో ని స్థలాన్ని కేటాయించేలా కేంద్ర రైల్వే మం త్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రైవేట్ పార్కింగ్‌లో రుసుం తగ్గించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. కాగా రెండో ఫ్లాట్ ఫాంపై నాగమణి అనే మహిళ ప్రమాదానికి గురికాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు.

జి ల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆయనవెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు కే చంద్రశేఖర్, ముస్తఫా, నాయకులు మిక్కిలినేని నరేందర్,  అనంతరెడ్డి, ఉమ్మినేని కృష్ణ పాపానాయక్ ఉన్నారు.