calender_icon.png 20 January, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లమలలో పెద్దపులి సంచారం

22-10-2024 12:51:25 AM

రోడ్డుపై కనిపించిన పులి

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఏపీలోని నంద్యాల జిల్లా  నంది కొట్కూర్ ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. గ్రామస్థులు జీపులో వెళ్తుండగా తిర్మాలపూర్ గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై పెద్దపులి కనిపిం చింది.

దీంతో వాహనాన్ని అక్కడే ఆపేశారు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన పులి కదలికలను పలువురు ప్రయాణి కులు తమ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడి యో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. అక్కడి అటవీ శాఖ అధికారులు పెద్దపులి అడుగుజాడలను గుర్తించి 126 ఎన్‌పిఆర్‌గా నిర్ధారించారు.