23 June, 2026 | 7:35 PM

Breaking News

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •  

కడ్తాల్ హెడ్మాస్టర్ సస్పెన్షన్

25-03-2026 01:42 AM

నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వరలను మంగళవారం సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. సోమవారం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రాళ్లు రావడంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రించడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం వలన ఈ ఘటన చోటుచేసుకుందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి ఆమె ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజనం నిర్లక్ష్యంగా వవరిస్తే ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.