calender_icon.png 19 January, 2026 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

19-01-2026 12:34:15 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి18: రహదారిపై ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని,యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది దరూరి యోగానంద చార్యులు కోరారు.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా  మద్దిరాల మండలం గోరంట్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఆదివారం అర్వపల్లిలోని జంక్షన్, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎదుట రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరుతూ ప్లెక్సీతో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని,కారు ప్రయాణికులు విధిగా సీటు బెల్టు ధరించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక వాడాలని చెప్పారు.వాహనదారులు అతివేగం,నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటికీ దూరంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,సర్పంచ్ బింగి కృష్ణమూర్తి,దేవస్థానం డైరెక్టర్లు జేరిపోతుల సోమయ్య,బీరెల్లి శ్రీధర్ రెడ్డి,నాయకులు బైరబోయిన హారాజు,యువకులు,గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.